RRR: ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడంటే.. కొత్త డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి?
RRR Movie Release Date: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం).
RRR Movie Release Date: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, మెగా పవర్‌స్టార్ రాం చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫొటోలు, క్యారెక్టర్ల ప్రోమోలు.. సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అయితే కరోనాతో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని సినిమాలు ఓటీటీల బాటన పడుతుంటే.. మరికొన్ని థియేటర్ల రీ ఓపెనింగ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ కూడా ఇదే పరిస్థితితో విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై ఓ అప్‌డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ రాజమౌళి మరో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది.
బిజినెస్ లో సరికొత్త రికార్డులు..
కాగా, ఈ హై బడ్జెట్ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పటికే పూర్తియినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా థియేటర్లో రిలీజ్ తరువాత డిజిటల్, శాటిలైట్ రైట్స్ తీసుకున్న ఓటీటీలు, ఛానల్స్ ను సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రూమర్స్ మేరకు ఈ సినిమా దాదాపు రూ. 900 కోట్ల బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇక టాలీవుడ్‌లో ఇంత బిజినెస్ జరిగిన సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులను క్రియోట్ చేసింది.
ఈ ఏడాది అక్టోబర్ లో అనుకున్నారు..
బాహుబలి అనంతరం డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేయనున్నారు. అయితే ముందు అనుకున్న మేరకు ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కావాల్సింది. కానీ, కరోనాతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని మేకర్స్ వెల్లడించారు. సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఏడాదిలో ఎప్పుడంటే..
తాజాగా రిలీజ్ ఎప్పుడనేది డైరెక్టర్ రాజమౌళి ఓ డేట్ ఫిక్స్ చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 2022 ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది కరోనాతో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ అయినా సీటింగ్ కెపాసిటీలో మార్పులు ఉండొచ్చనే అభిప్రాయం వెలువడుతోంది. అలాగే థర్డ్‌వేవ్ తో కరోనా మరోసారి దాడి చేయనుందనే టాక్ వినిపిస్తోంది. కాబట్టి ఇక ఈ ఏడాది రిలీజ్ చేయడం సాధ్యం కాదని మేకర్స్ కూడా అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారని టాక్. షూటింగ్ కూడా కొంత పూర్తి చేయాల్సి ఉండడం, ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం మరో ఆరు నెలలు పట్టొచ్చని తెలుస్తోంది. అందుకే వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసేందుకు డిసైడ్ అయినట్లు టాక్.