రజనీకాంత్ తో నెల్సన్ సినిమా లేనట్టేనా?

Nelson Dileep Kumar: పుకార్ల పై క్లారిటీ ఇస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్

Update: 2022-04-22 03:30 GMT
Director Nelson Dileep Kumar Gives Clarity on Thalaivar 169 Movie

రజనీకాంత్ తో నెల్సన్ సినిమా లేనట్టేనా

  • whatsapp icon

Nelson Dileep Kumar: సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ని ప్రకటించారు. తలైవర్ 169 గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మించాల్సి ఉంది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పట్టాలు ఎక్కేలా కనిపించటం లేదు. "కో కో కోకిల" సినిమాతో మంచి హిట్ అందుకున్న నెల్సన్ ఆ తర్వాత "డాక్టర్" సినిమాతో మరొక హిట్ అందుకున్నారు. క్రైమ్ కామెడీస్ తో డార్క్ హ్యూమర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన దిలీప్కుమార్ తాజాగా విజయ్ హీరోగా "బీస్ట్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా రిజల్ట్ చేసిన తర్వాత రజినీకాంత్ మరియు సన్ పిక్చర్స్ దిలీప్ కుమార్ తో చేయాల్సిన సినిమా కాన్సిల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు నెల్సన్. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్ ఎకౌంట్లో #తలైవర్169 అని కూడా రాసుకొని తన తదుపరి సినిమా రజినీకాంత్ తోనే అని ఇన్డైరెక్టుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News