Krish - Maruthi: రిస్క్ తీసుకున్నా డిజాస్టర్ లే అందుకున్న డైరెక్టర్లు

Krish - Maruthi: క్రిష్ ని ఫాలో అయ్యి ఫ్లాప్ అందుకున్న మారుతి

Update: 2021-11-06 09:00 GMT

క్రిష్ ని ఫాలో అయ్యి ఫ్లాప్ అందుకున్న మారుతి (ఫైల్ ఫోటో)

Krish - Maruthi: ఒకేసారి రెండు సినిమాలు తీయటం అంత సులువైన విషయం కాదు. ఎంత స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఒకేసారి రెండు విభిన్న కథలని డైరెక్ట్ చేయడం చాలా కష్టమైన పని. దాసరి నారాయణరావు తర్వాత మళ్లీ అలా రెండు మూడు సినిమాలు అన్ని ఒకేసారి హ్యాండిల్ చేసే డైరెక్టర్ కనిపించలేదు.

కానీ తాజాగా ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ఈ పద్ధతిని ఫాలో అయ్యారు. "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ కి బ్రేక్ పడటంతో క్రిష్ "కొండపోలం" సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. చేతిలో ఒక అగ్ర హీరో సినిమా ఉన్నప్పుడు మరోవైపు చిన్న సినిమా షూటింగ్ చేయటం రిస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి పొరపాటు జరిగినా స్టార్ హీరో సినిమా పైన పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కానీ క్రిష్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా "కొండపొలం" సినిమాని తీసేశారు. ఇక గోపీచంద్ హీరోగా నటిస్తున్న "పక్కా కమర్షియల్" సినిమా షూటింగ్ కి బ్రేక్ రాగానే మారుతి కూడా "మంచిరోజులు వచ్చాయి" సినిమా షూటింగ్ కేవలం 30 రోజుల్లో పూర్తి చేశారు.

షూటింగ్ మధ్యలో ఖాళీ సమయం చాలా మంది దర్శకులకి దొరుకుతుంది కానీ ఆ సమయంలో మరొక సినిమా షూటింగ్ ని పూర్తి చేసే డైరెక్టర్లు చాలా అరుదు. కానీ క్రిష్ మరియు మారుతి అదే పని చేశారు. అయినప్పటికీ సినిమాలు డిజాస్టర్ గా మారాయి. 'మంచి రోజులు వచ్చాయి' సినిమా కూడా ఫ్లాప్ గానే మారింది. దీంతో ఎంత కష్టపడి రిస్కు తీసుకున్నప్పటికీ ఈ క్రిష్ మరియు మారుతి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Tags:    

Similar News