Acharya Movie controversy : ఆచార్య వివాదంపై కొరటాల శివ క్లారిటీ!
Acharya Movie controversy : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిరంజీవి
Acharya Movie controversy : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇక్కడే సినిమాని కొన్ని వివాదాలు వెంటాడాయి.. ఈ కథ నాది అంటూ కొందరు యువ రచయితలు కాపీ ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే రాజేష్ అనే రచయిత తన కథని కాపీ చేశారని దీనిపైన చిరంజీవి, రామ్ చరణ్ తనకి న్యాయం చేయాలంటూ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
అయితే తాజాగా దీనిపైన ఆచార్య చిత్ర నిర్మతాల్లో ఒకరైనా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ దీనిపైన ఆఫీషియల్ గా ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారం అంటూ పేర్కొంది. ఇది ఒరిజినల్ కథ. ఈ కథ పూర్తిగా కొరటాల శివకు మాత్రమే చెందుతుంది అంటూ ఆ ప్రకటనలో వెల్లడించింది. తాజాగా దీనిపైన దర్శకుడు కొరటాల ఓ మీడియాకి ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. "నేను తీస్తున్నది మీ కథ కాదని స్పష్టం చేశారు.. మీరు చెప్పిన కథ వేరు నేను తీస్తున్నకథ వేరని అన్నారు.. నా కథ రిజిస్టర్ అయిందని ఇప్పుడు నేను కథను మార్చలేనని, సినిమా షూటింగ్ దశలో ఉండగా, నేను కథను రివిల్ చేయలేను అని చెప్పుకొచ్చారు కొరటాల.. అంతేకాకుండా ఈ వివాదం పైన, నా పైన తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నేను లీగల్ గా కోర్టుకు వెళ్తానని కొరటాల స్పష్టం చేశారు..
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.