Karuna Kumar: ఓకే కథ ఇద్దరు నిర్మాతలకు.. మరి చివరకి..
* ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది అనగా ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది.
Director Karuna Kumar: కరుణ కుమార్ "పలాస 1978" అనే సినిమాతో ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా "శ్రీదేవి సోడా సెంటర్" సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు రా మరియు రస్టిక్ సినిమాలే. బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించాయి. తాజాగా ఇప్పుడు కరుణ కుమార్ యువ హీరో విశ్వక్ సేన్ కి ఒక కథను వినిపించారట. విశ్వక్ సేన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై సూర్య దేవర నాగ వంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా "ఊర్వశివో రాక్షసివో" సినిమాని విడుదల చేసిన నిర్మాత ధీరజ్ మొగిలినేనికి కూడా కరుణ కుమార్ అదే స్క్రిప్ట్‌ను చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ధీరజ్ ఇప్పుడు సొంతంగా సినిమా నిర్మించాలని చూస్తున్నాడు. "ఊర్వశివో రాక్షసివో" సినిమాని GA 2 పిక్చర్స్‌తో కలసి నిర్మించిన ధీరజ్ నెక్స్ట్ సినిమా ని మాత్రం సింగిల్ గా నిర్మించాలని అనుకుంటున్నారు.
కరుణ కుమార్ కథ తనకు బాగా నచ్చడంతో ఒకే చెప్పారని తెలుస్తుంది. కానీ కరుణ కుమార్ అదే స్క్రిప్ట్‌ను సితార మరియు విశ్వక్‌లకు అందించాడు. ఇలా ఒకే కథను ఇద్దరు ప్రొడ్యూసర్స్ కు కరుణ కుమార్ వినిపించాడు. మరి చివరకి ఎవరితో సినిమా చేస్తారో చూడాలి.