Raghavendra Rao Emtional Tweet : బాలూ.. నాకు మాటలు రావట్లేదు.. నువ్వు పాడితే వినాలనుంది..
Raghavendra Rao Emtional Tweet : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయనకి కరోనా సోకడంతో
Raghavendra Rao Emtional Tweet : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయనకి కరోనా సోకడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు ఎస్పీ బాలు .. కొన్నిరోజులుగా వెంటిలేటర్ మీద ఉన్న బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. తాజాగా ఆసుపత్రి విడుదల చేసిన బులిటిన్ లో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని వివరించింది. ప్రస్తుతం ఆయనని వెంటిలేటర్‌ను తొలగించి ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. అయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తేలడంతో సినీ లోకం ఆందోళన పడుతుంది.
బాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు మాత్రమే కాదు సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంతేకాకుండా బాలు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. అందులో భాగంగానే సినీ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు... "బాలూ... నాకు మాటలు రావట్లేదు... నువ్వు పాడితే వినాలనుంది.. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్లతో ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాము... నీ గంభీరమైన స్వరంతో మైక్ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా..." అంటూ రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు..
ఇక ఎస్పీ బాలు ఆరోగ్య స్థితి పైన అయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు.. మీ ప్రార్థనలు వృథాగా పోవు. దేవుడు ఉన్నాడు. నాన్న ఆరోగ్యంతో తిరిగి వస్తారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను అంటూ చరణ్ వెల్లడించారు..
బాలూ... నాకు మాటలు రావట్లేదు... నువ్వు పాడితే వినాలనుంది.. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్లతో ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాము... నీ గంభీరమైన స్వరం తో మైక్ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా... pic.twitter.com/uP5yt6MYoC
— Raghavendra Rao K (@Ragavendraraoba) August 20, 2020