"శాకుంతలం" సినిమా తో రిస్క్ తీసుకుంటున్న డైరెక్టర్

"శాకుంతలం" సినిమా తో రిస్క్ తీసుకుంటున్న డైరెక్టర్

Update: 2022-10-02 15:00 GMT
Director Gunasekhar is Taking a Risk with Shaakuntalam Movie

"శాకుంతలం" సినిమా తో రిస్క్ తీసుకుంటున్న డైరెక్టర్

  • whatsapp icon

Shaakuntalam Movie: టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ లలో గుణ‌శేఖ‌ర్ కూడా ఒకరు. తన సినిమాలలో చాలా వరకు ప్రాధాన్యత కథకి, స్క్రీన్ ప్లే ఇస్తూ ఉంటారు. అలానే "చూడాల‌ని ఉంది", "ఒక్క‌డు", "అర్జున్" వంటి బ‌ల‌మైన క‌థ‌లతో సూపర్ హిట్ లను అందుకున్నారు. అయితే ఈమ‌ధ్య కాలంలో మాత్రం గుణ శేఖర్ టెక్నిక‌ల్ విష‌యాల‌పై ఎక్కువగా ఫోక‌స్ పెడుతున్న‌ట్టు చెప్పుకోవచ్చు. దానికి ఉదాహ‌ర‌ణ "రుద్ర‌మదేవి". "బాహుబ‌లి" కి ధీటుగా ఈ సినిమాని తీద్దామ‌నుకున్నారు గుణ‌ శేఖర్. స్టార్ నటీనటులతో, సొంత నిర్మాణ సంస్థ తో భారీ బడ్జెట్ పెట్టి మ‌రీ సినిమాను తీశారు. "రుద్ర‌మ‌దేవి" ని ఏకంగా త్రీడీలో కూడా తెరకెక్కించారు.

అయితే ఆ త్రీడీ ఎఫెక్టు కూడా సినిమాను కాపడలేకపోయింది. ఖర్చు తడిసి మోపెడయింది కానీ క్వాలిటీ కూడా ఆ రేంజి లో లేదు. క‌ల్యాణ్ రామ్ తో తీసిన "ఓం" కూడా త్రీడీలో విడుదల చేశారు కానీ అది కూడా ఫ్లాప్ అయ్యింది. తాజాగా ఇప్పుడు గుణ‌శేఖ‌ర్ "శాకుంతలం" సినిమాని కూడా త్రీడీలో తీయాలని నిర్ణ‌యం తీసుకున్నారట. ఇప్ప‌టికే ఈ సినిమాపై బాగా ఖర్చుపెట్టాడు గుణ‌శేఖ‌ర్‌. త్రీడీ అంటే బడ్జెట్ మరింతగా పెరుగుతుంది. మరి ఇప్పటికే రెండు డిజాస్టర్ లు చూశాక కూడా గుణ శేఖర్ ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారో అని అభిమానులు సైతం షాకయ్యారు.

Tags:    

Similar News