ఒక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించనున్న రామ్ చరణ్

*ఒక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించనున్న రామ్ చరణ్

Update: 2022-03-27 12:30 GMT
Director Gowtam Tinnanuri And Ram Charan Movie Story | Tollywood News

ఒక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించనున్న రామ్ చరణ్

  • whatsapp icon

Ram Charan-Gowtam Tinnanuri: "ఆర్ ఆర్ ఆర్" సినిమా తో రామ్ చరణ్ తన కెరియర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 15వ సినిమా ను స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 

కీయారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత తన పదహారవ సినిమాని రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసేందుకు సైన్ చేశారు."మళ్ళీరావా", "జెర్సీ" వంటి ఎమోషనల్ డ్రామా సినిమాలతో మంచి హిట్లు అందుకున్న గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో కూడా అలాంటి సినిమానే చేస్తారని అభిమానులు అనుకున్నారు. 

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నట్లు, రామ్ చరణ్ ని ఒక మాస్ అవతారంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News