"వారసుడు" విషయంలో దిల్ రాజు లెక్క తప్పింది..!
* విజయ్ సినిమా పై దిల్ రాజు నమ్మకం వమ్మయ్యింది
DilRaju: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య విడుదలైన "వారసుడు" సినిమా కోసం ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కోలివుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని దిల్ రాజు స్వయంగా నిర్మించారు. దీంతో ఈ సినిమాపై దిల్ రాజు బోలెడంత నమ్మకం కూడా పెట్టుకున్నారు. కానీ సినిమా బడ్జెట్ కొంచెం ఎక్కువ అవ్వడంతో సినిమాపై దిల్ రాజు కి పెద్దగా ప్రాఫిట్ లు లభించలేదు.
అయినప్పటికీ ఒకసారి ఈ సినిమా విడుదల అయితే కలెక్షన్ల పరంగా అయినా దిల్ రాజు ప్రాఫిట్ జోన్లోకి వెళ్లచ్చని అనుకున్నారు. అందుకే సినిమా తమిళ్ వర్షన్ ని వేరే వాళ్ళకి అమ్మేసినా కూడా తెలుగు వర్షన్ ని తానే స్వయంగా విడుదల చేశారు. కానీ ఈ సినిమా విషయంలో దిల్ రాజు లెక్కలు అన్నీ తప్పయ్యాయి. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఇక సినిమా కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అటువైపు తమిళ్లో కూడా సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ పాయింట్ నే చేరుకోలేదు. పైగా సంక్రాంతి సెలవులు కూడా పూర్తయిపోయాయి.
పండగ సమయంలో కలెక్షన్లు భారీగా వస్తాయని దిల్ రాజు అనుకున్నారు కానీ అలా జరగలేదు. తెలుగు వర్షన్ రెవెన్యూ కూడా చాలా తక్కువగానే ఉంది. "వాల్తేరు వీరయ్య" మరియు "వీర సింహా రెడ్డి" సినిమాలు బాగానే పుంజుకున్నాయి కానీ ఈ రెండు సినిమాల మధ్య "వారసుడు" సినిమా పెద్దగా ఆడలేదు. ఇలా దిల్ రాజు ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది.