త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న దిల్ రాజు "బలగం"

* ఇక ఈ సినిమాలో బోలెడు మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా కనిపించనున్నారు

Update: 2022-12-02 09:54 GMT

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న దిల్ రాజు "బలగం"

Dil Raju: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి తాజాగా ఇప్పుడు వరుసగా కొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్న ఈ సినిమాలు త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఇక వాటిలో ప్రేక్షకులు అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా "బలగం". కమెడియన్ నల్ల వేణు దర్శకత్వం వ్యవహరించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.

తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు "బలగం" అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసారు దర్శకనిర్మాతలు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కూడా విడుదల చేయబోతున్నారు.

"మల్లేశం" సినిమాతో హీరోగా కూడా మంచి మార్కులు వేయించుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బోలెడు మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా కనిపించనున్నారు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా మంగ్లీ కూడా ఒక మంచి పాట పాడిన సంగతి తెలుస్తోంది. ఇక కమెడియన్ నల్ల వేణు కథ చాలా బాగా నచ్చిందని అందుకే ఈ సినిమాని నిర్మించడానికి ఒప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ నుంచి చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయమై చాలా వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. మరి నల్ల వేణు దశ మారుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News