Dil Raju: స్పైడర్, అజ్ఞాతవాసి నష్టాలు.. వేరే వాళ్లు అయితే సూసైడ్ చేసుకునేవారు..
* "ఆ రెండు సినిమాల వల్ల చాలా నష్టపోయాను" అంటున్న దిల్ రాజు
Dil Raju: టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిల్ రాజు తన కరియర్ లో ఎదుర్కొన్న భారీ డిజాస్టర్ గురించి చెప్పుకొచ్చారు. 2017లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మరియు మహేష్ బాబు స్పైడర్ సినిమాలతో తీవ్ర నష్టాలకు గురైనట్లు చెప్పుకొచ్చారు దిల్ రాజు. "2017 లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా చేశాను నైజాం ఏరియా రైట్స్ ను కొనుగోలు చేశాను. కానీ సినిమా ఫ్లాప్ అయింది.
నా కరియర్ లో నేను ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డామేజ్ అది. అదే ఏడాది మహేష్ బాబు స్పైడర్ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఈ రెండు సినిమాల వల్ల నేను చాలా నష్టపోయాను," అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. "నేను కాబట్టి ఈ రెండు డిజాస్టర్ లను తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు. అదే ఏడాది ఆరు సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ రావడంతో నేను ఇంకా నిర్మాతగా నిలబడగలిగాను," అని అన్నారు దిల్ రాజు.
అయితే తాజాగా ఇప్పుడు కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "వారసుడు" కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళ్లో "వారిసు" అనే టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక అదే సమయంలో విడుదల కాబోతున్న చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం ఎక్కువ థియేటర్లను తీసుకున్నారు అని దిల్ రాజు వివాదంలో కూడా ఇరుక్కున్నారు.