"ఆర్ ఆర్ ఆర్" కి బాహుబలి కి మధ్య అన్ని తేడాలు ఉన్నాయా?

"ఆర్ ఆర్ ఆర్" కి బాహుబలి కి మధ్య అన్ని తేడాలు ఉన్నాయా?

Update: 2022-03-23 11:00 GMT

"ఆర్ ఆర్ ఆర్" కి బాహుబలి కి మధ్య అన్ని తేడాలు ఉన్నాయా?

Bahubali-RRR: తెలుగు సినీ ఇండస్ట్రీ ని బాహుబలి సినిమా కి ముందు మరియు బాహుబలి సినిమా కి తరువాత అంటూ విడదీసి మాట్లాడొచ్చు ఎందుకంటే బాహుబలి సృష్టించిన సంచలనం అటువంటిది. అయితే బాహుబలి సినిమా 2 భాగాలతోనూ ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన రాజమౌళి ఇప్పుడు తన తదుపరి సినిమా అయిన "ఆర్ఆర్ఆర్" తో వాటిని తిరగరాస్తారు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే బాహుబలికి "ఆర్ఆర్ఆర్" కి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. బాహుబలి పక్కా కమర్షియల్ సినిమా కానీ "ఆర్ ఆర్ ఆర్" ఒక ఎమోషనల్ దేశభక్తి సినిమా. బాహుబలి సినిమా 2 వారాల పాటు ఐదు వందల రేటు అవకాశం ఇచ్చింది కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా కి భారీ బ్లాక్బస్టర్ టాక్ వస్తే తప్ప ఇలాంటి కలెక్షన్లు చేయటం సాధ్యం కాదు. ఆర్ ఆర్ ఆర్ కి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు మాత్రమే పుల్లింగ్ ఫ్యాక్టర్ లు కానీ బాహుబలి లో తమన్నా గ్లామర్, అనుష్క నటన, ఐటెం సాంగులు ఇలా చాలానే ప్లస్ పాయింట్లు ఉన్నాయి.

ఇక అన్నిటికంటే ముఖ్యమైన తేడా బాహుబలి సినిమాల సమయంలో కరోనా అన్న మాట కూడా లేకపోవడం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకూ ప్రేక్షకులు ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. థియేటర్లలో సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇలా ఈ రెండు ప్యాన్ ఇండియన్ సినిమాలకు మధ్య చాలానే తేడాలు ఉన్నాయి.

Tags:    

Similar News