Dhruv Vikram : అర్జున్ రెడ్డి మొదటి వెర్షన్ ఓటీటీలో?
Dhruv Vikram : ఏమిటీ కన్ఫ్యూజ్ అవుతున్నారా.. అర్జున్ రెడ్డి ఏమిటి? రెండు వెర్షన్ లు ఏమిటి అని.. ఇందులో గందరగోళం ఏమీ లేదు.
Dhruv Vikram : ఏమిటీ కన్ఫ్యూజ్ అవుతున్నారా.. అర్జున్ రెడ్డి ఏమిటి? రెండు వెర్షన్ లు ఏమిటి అని.. ఇందులో గందరగోళం ఏమీ లేదు. మన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్టో తెలుసు కదా.. అదే సినిమాని తమిళంలో తీశారు. ఆ సినిమాని రెండు సార్లు తెరకెక్కించారు అక్కడ. రెండో వెర్షన్ థియేటర్లలో విడుదలై రికార్డుల దుమ్ము దులిపింది.
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా ఓ సంచలనం అని చెప్పాలి.. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది.. దీనితో ఈ సినిమాని వేరే భాషల్లో రీమేక్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. బాలీవుడ్ లో సందీప్ వంగ ఈ సినిమాని కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి అక్కడ భారీ హిట్ కొట్టారు.
అందులో భాగంగానే ఈ సినిమాని తమిళ్ లో కూడా రీమేక్ చేశారు. అయితే కోలీవుడ్ లోనే ఈ సినిమాని రెండు సార్లు తెరకెక్కించడం విశేషం.. తమిళ్ టాప్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తూ బాల అనే దర్శకుడు 'వర్మ' అనే పేరిట ఈ సినిమాని తెరకెక్కించారు.. అయితే సినిమా మొత్తం అయిపోయి అవుట్ ఫుట్ చూశాక అనుకున్నంతగా ఉండకపోవడంతో ఇదే సినిమాని మరో దర్శకుడితో "ఆదిత్య వర్మ" గా తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు.
అయితే బాల అనే దర్శకుడితో చేసిన మొదటి వెర్షన్ అలాగే హోల్డ్ లో ఉండపోవడంతో ఆ సినిమాని ఇప్పుడు డైరెక్ట్ స్ట్రీమింగ్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసి నవంబర్ నెలలో విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి వెర్షన్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి!