First Day Rs. 100 Crore క్లబ్‌లో దేవర ఎన్టీఆర్

Devara box office: సినిమా విడుదలైన మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన స్టార్ల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు.

Update: 2024-09-28 12:46 GMT

Devara – Junior NTR: ‘ఫస్ట్ డే 100 కోట్ల’ స్టార్ క్లబ్‌లో తారక్

Devara – Junior NTR: సినిమా విడుదలైన మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన స్టార్ల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. దేవర సినిమా ఆ విధంగా ఆయన కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది. ప్రభాస్ ఇటీవలి చిత్రం కల్కి 2898ఏడీ సినిమా తరువాత దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్లలో రెండో స్థానంలో నిలిచింది.

Sacnilk.com అనే బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్ సైట్ వివరాల ప్రకారం దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ 140 కోట్లు దాటిపోయాయి. ఇండియన్ మార్కెట్లోనే ఈ చిత్రం రూ. 77 కోట్లు వసూలు చేసింది.

దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా మొదటి రోజునే 8,000 షోలు వేశారు. ఇందులో 4,200 తెలుగు వెర్షన్ షోలు. ఆ తరువాత హిందీ దేవర 3,200 షోస్ వేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే దేవర సినిమా మొదటి రోజున 1,726 షోలు వేశారు.

ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్‌లో జూనియర్ ఎన్టీఆర్

రూ. 140 కోట్ల అఫిషియల్ కలెక్షన్స్‌ సాధించిన దేవర చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ సోలోగా ఫస్ట్ డే 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన స్టార్ల జాబితాలో చేరిపోయారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటింటిన జవాన్ (రూ. 129 కోట్లు), పఠాన్ (రూ. 105 కోట్లు) సినిమాలు రెండూ మొదటి రోజున 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసి చరిత్ర సృష్టించాయి. తమిళ నటుడు దళపతి విజయ్ కూడా గోట్, లియో చిత్రాలతో ఈ రికార్డు సృష్టించారు. గోట్ సినిమా ఫస్డ్ డే 100 కోట్లు, లియో 142 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక, ఈ విషయంలో తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఫస్డే డే 100 కోట్లు సాధించిన చిత్రాలు ఆయన అకౌంటులో అయిదు ఉన్నాయి.

ఓపెనింగ్ డే రూ. 100 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాలు

RRR: రూ. 223 కోట్లు

బాహుబలి-2: రూ. 217 కోట్లు

కల్కి 2989 ఏడీ: రూ. 177.70 కోట్లు

కేజీఎఫ్ చాప్టర్ 2: రూ. 159 కోట్లు

సలార్ -1: రూ. 158 కోట్లు

లియో: రూ. 142 కోట్లు

సాహో: రూ. 130 కోట్లు

జవాన్: రూ. 129 కోట్లు

ఆదిపురుష్: రూ. 127 కోట్లు

యానిమల్: రూ. 116 కోట్లు

పఠాన్: రూ. 105 కోట్లు

ది గోట్: రూ. 100 కోట్లు

(Source: https://www.sacnilk.com/)

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాహ్నవి కపూర్‌ను తెలుగులో హీరోయిన్‌గా పరిచయం చేస్తూ విడుదలైన దేవర చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ ఇమేజిని రెండింతలు చేసింది. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందన్నది ఆల్ ఇండియా టాక్.

Tags:    

Similar News