Devara: చివరి క్షణంలో మార్పు.. దేవర యూనిట్ కీలక నిర్ణయం..!

Devara: దేవర కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తితో ఉన్నారు.

Update: 2024-09-25 06:16 GMT

Devara: చివరి క్షణంలో మార్పు.. దేవర యూనిట్ కీలక నిర్ణయం..!

Devara: దేవర కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తితో ఉన్నారు. ఆచార్య వంటి వైఫల్యం తర్వాత ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే సంకల్పంతో ఉన్న దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండడంతో బాలీవుడ్ లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఇప్పటికే ప్రమోషన్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా దేవర ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. కాగా సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రన్ టైంను తగ్గిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

దాదాపు 7 నిమిషాలు సినిమా నిడివిని ట్రిమ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఈ సినిమా 2.50 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చే సురక్షిత ప్రయాణ హెచ్చరిక, ధూమపానం, మద్యపానం హెచ్చరికలను మినహాయిస్తే ఈ సినిమా మొత్తం నిడివి 2.42 గంటలు ఉండనుంది. అంతకు ముందు ఈ సినిమా మొత్తం నిడివి 2.57 గంటలుగా ఉంది.

ఇదిలా ఉంటే విడుదలకు ముందే దేవర రికార్డులు మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ రిలీజ్ టికెట్ బుకింగ్స్ లో దేవర సరికొత్త రికార్డులను సృష్టించింది. జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాతో పలకరించనుంది. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోన్న దేవర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.

Tags:    

Similar News