Devara: ఎన్టీఆర్‌ అభిమానులకు నిరాశ.. రాత్రి ఒంటిగంట షో క్యాన్సిల్‌

Devara 1 AM Premiere Show Cancelled: దేవర థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది.

Update: 2024-09-26 14:30 GMT

Devara: ఎన్టీఆర్‌ అభిమానులకు నిరాశ.. రాత్రి ఒంటిగంట షో క్యాన్సిల్‌

Devara 1 AM Premiere Show Cancelled: మరికొన్ని గంటల్లో దేవర థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్స్‌ ధర పెంపుతో పాటు ప్రీమియం షోల నిర్వాహణకు అనుమతులు ఇచ్చాయి. కొత్త సినిమా విడుదల అనగానే హైదరాబాద్‌లో ఉండే సినీ లవర్స్‌కి కూకట్‌పల్లిలోని భ్రమరాంబ-మల్లికార్జున థియేటర్‌ గుర్తొస్తుంది.

ఇక్కడ అర్థరాత్రి ఒంటి గంటకు షో చూడాలని చాలా మంది ఫ్యాన్స్‌ ఆతృతతో ఉంటారు. అందరికంటే ముందుగా తమ అభిమాన హీరో సినిమా చూడాలని కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే దేవర కూడా భ్రమరాంబ – మల్లికార్జున థియేటర్ లో రాత్రి ఒంటిగంటకు షో వేస్తున్నట్లు ప్రకటించారు. టికెట్లు కూడా విక్రయించారు. అయితే తాజాగా ఈ షోలు క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి థియేటర్‌ యాజమాన్యం బయట పోస్టర్లు అతికించారు. సినిమా డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యాజమాన్యం మధ్య వచ్చిన ఇంటర్నల్ క్లాష్ కారణంగా ఈ షో క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఉదయం నాలుగు గంటల నుంచి మిగతా షోలు యథావిధిగా కొనసాగుతాయి కానీ ఒంటిగంట షో మాత్రం క్యాన్సిల్ అయినట్లుగా చెబుతున్నారు. మరి టికెట్స్‌ కొనుగోలు చేసిన వారికి థియేటర్‌ యాజమాన్యం తిరిగి డబ్బులు చెల్లిస్తుందా.? ఏం జరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే నందమూరి హీరోలు తమ సినిమాల తొలి షోను ఈ థియేటర్లలో చూడడం ఎప్పటి నుంచో ఒక ఆనవాయితీగా వస్తోంది. చాలా మంది దర్శకులు, హీరోలు సైతం ఈ థియేటర్‌లో ఫస్ట్ షో సినిమాను వీక్షిస్తారు అయితే తాజాగా టికెట్ రేట్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్ కు సినిమా ఎగ్జిబిటర్ కు మధ్య వచ్చిన లెక్కల తేడా నేపథ్యంలో ఈ షోని ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్ హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News