Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో పురోగతి..! డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
Sushant Singh Rajput: అతి ముఖ్యమైన ఆధారాలు సేకరించినట్లు తెలిపిన ఫడ్నవీస్ సీబీఐ ఆధారాలను సేకరించి.. పరిశీలిస్తుంన్న ఫడ్నవీస్
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మిస్టరీ వీడలేదు. 2020 జూన్‌లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. యువహీరో మరణవార్త అప్పట్లో యావత్ దేశాన్ని కలచివేసింది. అయితే సుశాంత్ మరణం వెనుక కుట్ర ఉందని.. హత్యను ఆత్మహత్యగా చూపించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో కేసును సీబీఐకి అప్పగించారు. కేసు సీబీఐకి బదిలీ అయి మూడేళ్లయినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.
అయితే ఈ కేసుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. తొలుత కేవలం స్టేట్‌మెంట్లే ఆధారంగా ఉండగా.. అందులో కొందరు బలమైన సాక్ష్యాలున్నాయని చెప్పినట్లు తెలిపారు ఫడ్నవీస్. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుందని.. చర్యలు చేపట్టి, ప్రాథమిక సాక్ష్యాలను అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు.