Dear Nanna: ఓటీటీలో దుమ్మురేపుతోన్న కొత్త సినిమా.. కట్టిపడేస్తున్న ఎమోషనల్ సీన్స్‌..!

ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు టాప్‌ రేటింగ్స్‌ వస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.

Update: 2024-06-15 15:23 GMT

Dear Nanna: ఓటీటీలో దుమ్మురేపుతోన్న కొత్త సినిమా.. కట్టిపడేస్తున్న ఎమోషనల్ సీన్స్‌..!

Dear Nanna: వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ప్రతీ వారం కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'డియర్‌ నాన్న' చిత్రం వ్యూస్‌తో దూసుకుపోతోంది. చైతన్య రావు, యష్ణ చౌదరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 14వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు టాప్‌ రేటింగ్స్‌ వస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఫాదర్ డే స్పెషల్‌గా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని కరోనా బ్యాక్ డ్రాప్‌లో ఫాదర్ సన్ ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా తండ్రీ, కొడుకల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

ఇక డియర్‌ నాన్న కథ విషయానికొస్తే.. చైతన్య రావు చెఫ్‌ కావాలని ఎన్నో కలలు కంటుంటారు. అయితే ఈ క్రమంలోనే చైతన్య రావు జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి లాంటి అంశాలను ఇతి వృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య రావు, సూర్య కుమార్ భగవాన్ దాస్ తండ్రీకొడుకులగా నటించారు. కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.

కరోనా సమయంలో మెడికల్ షాప్‌ల ప్రాధాన్యత, వారు ఈ సమయంలో చేసిన త్యాగాలు, చూపిన తెగువని దర్శకుడు ఎంతో చక్కగా చూపించారు. చైతన్య రావు నటన, యష్ణ చౌదరి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తింది. ఇక అనిత్ కుమార్ మాధాడి కెమెరా పనితనం, గిఫ్టన్ ఎలియాస్ నేపధ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం ఆ ఫీల్‌ గుడ్ మూవీని ఈ వీకెండ్‌కి మీరు కూడా ఎంజాయ్‌ చేయండి. 

Tags:    

Similar News