Bheemla Nayak: "భీమ్లా నాయక్" లో ఎత్తేసిన రెండు సన్నివేశాలు
Bheemla Nayak: ఒక మామూలు సినిమాతో హిట్ అందుకోవడం కంటే రీమేక్ సినిమాతో హిట్ కొట్టడం చాలా కష్టం.
Bheemla Nayak: ఒక మామూలు సినిమాతో హిట్ అందుకోవడం కంటే రీమేక్ సినిమాతో హిట్ కొట్టడం చాలా కష్టం. ఒకవేళ ఉన్నది ఉన్నట్టు తీస్తే ఓకే కథని దింపేసారు అని కామెంట్లు చేస్తారు. లేదా కథలో మార్పులు చేస్తే ఒరిజినల్ ఫ్లేవర్ మిస్సయింది అని అంటారు. కాబట్టి రీమేక్ సినిమాలు చేయడం కొంచెం కష్టం అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియిమ్" సినిమాకి రీమేక్ గా పవన్ కళ్యాణ్ మరియు రానాలు హీరోలుగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా ఈ మధ్యన విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయితే సినిమా బాగున్నప్పటికీ ఒరిజినల్ లో ఉండే కొన్ని సన్నివేశాలు ఇందులో లేవని, అందులో రెండు సన్నివేశాలు ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఒరిజినల్ సినిమాలో కూట్టమణి పాత్ర ఇంటిని అయ్యప్పన్ బుల్డోజర్ కూల్చేస్తాడు. పక్కనే కోషి కూడా ఉండటంతో ఆ సన్నివేశం ప్రేక్షకులకు మంచి హై ఇస్తుంది. కానీ తెలుగులో ఆ సన్నివేశాన్ని బాంబుతో రీప్లేస్ చేశారు. కాబట్టి ఆ సన్నివేశం అంత మాస్ గా లేదని కొందరు అంటున్నారు. మరొకసారి కొషి రోడ్డు మీద నడుస్తూ వస్తుంటే అయ్యప్పన్ లిఫ్ట్ ఇస్తాడు. ఆ సన్నివేశాన్ని తెలుగులో పూర్తిగా ఎత్తివేశారు. అయ్యప్పన్ మెడ మీద కత్తి పెట్టడం కూడా ఆ సన్నివేశానికి హైలైట్ కానీ తెలుగు లో ఆ సన్నివేశం కూడా లేకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు.