CPI Narayana: బిగ్ బాస్‌ని నిలిపివేయాలంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం

CPI Narayana: *బిగ్‌ బాస్ షో ద్వారా సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారు *బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుందా ?

Update: 2021-09-13 08:00 GMT

బిగ్ బాస్‌ని నిలిపివేయాలంటూ సీపీఐ నారాయణ ఆగ్రహం

CPI Narayana: బిగ్ బాస్ షో ద్వారా సాంస్కృతిక దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు సీపీఐ నారాయణ. కళామ్మతల్లికి అన్యాయం చేస్తున్నారు. దీని ద్వారా కళామ్మతల్లికి ప్రమాదం ఏర్పడిందని బిగ్ బాస్‌ని నిలిపివేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ నారాయణ.

నిజానికి బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి కూడా నారాయణ ఒక వీడియో విడుదల చేస్తుంటారు. ఈ సీజన్‌కి కూడా తన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ బిగ్ బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సారి తన మాటల్లో మరి కాస్త ఘాటు పెంచుతూ.. అది చాలా అనైతిక షో అని, బూతుల ప్రపంచం అని ఆయన విరుచుకుపడ్డారు.

''ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏ సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇలాంటి బిగ్ బాస్ ప్రసారానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు అనుమతిస్తోంది. ఇదో బూతుల ప్రపంచం. ఈ బూతుల ప్రపంచాన్ని వందల, వేల కోట్ల వ్యాపారాలకు ఉపయోగపడే పద్ధతుల్లో బిగ్ బాస్‌కి అనుమతి ఇవ్వడం చాలా ఘోరం. హౌస్‌లో వాళ్ళ కీచులాటలు, పోట్లాటలు.. ఓ అనైతిక పద్ధతైన వ్యవహారం ఇది.

ఇలాంటి అనైతిక విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడం సరికాదని కోర్టులో వ్యాజ్యం వేసినా న్యాయవ్యవస్థ కూడా సహకరించడం లేదు. ఇలాంటి వాటి పట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సాయం చేయదు. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి పనికిమాలిన అనైతిక ప్రోగ్రామ్స్‌ని అనుమతించడం సరికాదు. బిగ్ బాస్ లాంటి సాంసృతిక హీనమైన ప్రోగ్రామ్స్ అరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం'' అని నారాయణ అన్నారు.

Tags:    

Similar News