టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్..
టాలీవుడ్‌కు కరోనా కొంతవరకు లాభాన్ని చేకూర్చింది. ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.
టాలీవుడ్‌కు కరోనా కొంతవరకు లాభాన్ని చేకూర్చింది. ధియేటర్లు ఓపెన్ కాకపోవడంతో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అయితే.. ఇప్పటివరకు ఓటీటీ ఫార్మాట్‌లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో.. ఇవే సినిమాలను థియేటర్‌లలో రిలీజ్ చేసి ఉంటే డిస్ట్రిబ్యూటర్లు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఉండేది.
ఓవర్ సీస్ బయ్యర్ల నుంచి మన డిస్ట్రిబ్యూటర్ల వరకు సినిమాలు తీసుకుని రిలీజ్ చేసే అవకాశం ఇప్పుడు లేదు. ఇదే వారికి ఇప్పుడు కలిసి వచ్చింది. ఓటిటిలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్లాప్ అవ్వటంతో కరోనా తమకు చాలా వరకు మంచి చేసిందనుకుంటున్నారు.
కీర్తి సురేష్ సినిమాలు ఓటిటి వేదికగా చాలా వరకు రిలీజ్ అవ్వటం.. అవి అన్నీ కూడా ప్లాప్ అవ్వటం తో ఓటిటికి నష్టం తప్ప.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం కాదు. భవిష్యత్ లో వచ్చే సినిమాలను కూడా డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే అవకాశం లేదు. మరోవైపు థియేటర్లు కూడా తెరుచుకోకపోవడంతో మరికొన్ని రోజులు ఓటిటి లోనే మన సినిమాలు రిలీజ్ చేసుకుంటారు నిర్మాతలు.