గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై ఇప్పుడు రాజకీయ దూమారం రేగుతుంది. పద్మశ్రీ పురస్కారానికి అడ్నాన్ సమీ అర్హుడని బీజేపీ చెబుతుంటే అతనికి పద్మశ్రీ అవార్డు ఇస్తే 130 కోట్ల మంది భారతీయులను అవమానించేనట్టేనని ఎన్సీపీతో సహా ప్రతిపక్షాలు విమర్శించాయి.
46 ఏళ్ల అద్నాన్ సమీ 2016 లో భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయన తండ్రి అర్షద్ సమీ ఖాన్ పాక్ ఎయిర్ పోర్స్ పైలెట్ గా పనిచేశారు. 1965లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ తరపున అయన పాల్గొన్నారు. పాక్ పైలెట్ కొడుక్కి ఎలా అవార్డు ఇస్తారాని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ 'షెర్షిల్ ట్విటర్ వేదికగా ఆరోపించారు.
అయితే అయన చేసిన ఆరోపణలకి గాను అడ్నాన్ సమీ బదులిస్తూ .. "హేయ్ కిడ్.. మీ బుద్ధిని క్లియరెన్స్ సేల్ నుంచి తెచ్చుకున్నారా లేదా సెకండ్ హ్యాండ్ స్టోర్ నుంచి కొనుక్కున్నారా? తల్లితంద్రుల చేసిన వాటికీ పిల్లలు ఎలా బాధ్యులవుతారు? మీరో న్యాయవాది. లా స్కూల్‌లో మీకు ఇదే నేర్పరా రా?' అంటూ సమీ రీట్వీట్ చేశారు. ఇక పద్మశ్రీ ఇచ్చినందుకు గాను భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తేలిపాడు. పద్మశ్రీ పురస్కారం నాకు నా కుటుంబానికి గర్వకారణం అని పేర్కొన్నాడు.