Jathi Ratnalu: 'జాతిరత్నాలు' సినిమాను నిషేదించాలంటూ శివసేన ఫిర్యాదు
Jathi Ratnalu: నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన చిత్రం 'జాతిరత్నాలు'.
Jathi Ratnalu: నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన చిత్రం 'జాతిరత్నాలు'. మార్చి 11వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలకు ముందే బెస్ట్ ప్రమోషన్స్ దక్కడంతో.. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తొలి రోజు నుంచే ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ రన్ చూసిన జనం మౌత్ టాక్ పాజిటివ్‌గా రావడంతో లాక్ డౌన్ తర్వాత భారీ హిట్ కొట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ నేపథ్యంలో జాతిరత్నాలు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో స్వాతంత్ర సమరయోధులను కించపరిచారని, సినిమా దర్శకుడు, నిర్మాత, నటులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బ్యాన్ చేయాలని అంటున్నారు శివసేన నాయకులు. శివసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమా గంగాధర్ సినిమాను నిషేధించాలని కోరుతూ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.
స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్ బిస్మిల్ ఉరికంబం ఎక్కే ముందు పాడిన సర్ ఫరోషికీ తమన్నా హబ్ హమారే దిల్ మీ హై.. కవితను జాతిరత్నాలు సినిమాలో సర్ ఫరోషికీ తమన్నా, సమంతా, రష్మిక, తీనోసాథ్ హాయ్.. అంటూ వెటకారంగా పాడి జాతిరత్నాలు సినిమాను నిషేదించాలంటూ శివసేన ఫిర్యాదు చేశారు. సినీ రచయిత, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, కవితను ఆలపించిన వారిపై కూడా చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జాతిరత్నాలు మూవీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ దక్కించుకుంది. భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ ఇండియా ఏప్రిల్ నెల రెండో వారంలో స్ట్రీమ్ చేయనుంది.