Acharya Movie: మెగాస్టార్ 'ఆచార్య' లో కామెడీ దే కీ రోల్ ?

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' (Acharya) సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు.

Update: 2021-03-17 09:31 GMT

ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి (ఫొటో హన్స్ ఇండియా)

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' (Acharya) సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. చిరంజీవిని యాక్షన్ మోడ్‌లో చూపిస్తూ.. టీజర్‌ను లాంచ్ చేశారు. దీంతో ఈ చిత్రం సీరియస్‌ మోడ్ లో ఉంటుందనుకుంటున్నారు ఫ్యాన్స్... కానీ, ఈ చిత్రంలో అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో కామెడీ కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.

చిరంజీవి, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ థియేటర్స్ లో కడపు చక్కలయ్యేలా చేస్తాయని అంటున్నారు. వీరిద్దరి కామెడీ ట్రాక్ సినిమాకు చాలా హెల్స్ చేస్తుందని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

చిరంజీవి, వెన్నల కిషోర్ ల కామెడీ ట్రాక్ తోపాటు బెనర్జీ, తనికెళ్ల భరణి ఈ చిత్రం అంతటా కనిపించి నవ్వులు పండిస్తారని మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ సీపన రచయితగా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News