Cinema: పరేషాన్ లో చిన్న నిర్మాతలు
Cinema: కావాల్సినన్నిథియేటర్‌లు ఉన్నాపదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాప్రేక్షకుడు ఆసక్తి కనబర్చడం లేదు.
Cinema: లాక్‌డౌన్ తర్వాత సినీ ఇండస్ట్రీలోని అన్ని వ్యవస్థలు మెల్లమెల్లగా గాడిలో పడుతున్నాయి. థియేటర్లు కూడా వంద శాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో వరుస విజయాలు నమోదు అవుతుండటంతో సినిమాలన్నీ బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు క్యూ కడుతున్నాయి. అదే స్థాయిలో రిలీజ్ కూడా అవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించగలుగుతున్నాయి.
లాక్‌డౌన్ తర్వాత...
లాక్‌డౌన్ తర్వాత వారానికి రెండు మూడు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేవి. ఆడియెన్స్ కూడా ఒకటి కాకపోతే... మరొకటి చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ వారం A1 ఎక్స్‌ప్రెస్, షాదీ ముబారక్, పవర్‌ప్లే, ప్లే బ్యాక్, గజకేసరి, విక్కమార్కుడు, మూవీ-A ఇలా సుమారు పది సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ షాదీముబారక్, A1 ఎక్స్‌ప్రెస్ సినిమాలకు మాత్రమే థియేటర్లలో ప్రేక్షకులు కాస్తో కూస్తో కన్పించారు. మిగతా సినిమాలకు మాత్రం ఓపెనింగ్స్ కూడా లేని పరిస్థితి. కొన్ని చోట్లయితే మల్టీఫ్లెక్సీల్లో టికెట్ల ధరలు కన్ఫామ్ కాక.. షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో నిర్మాతలంతా పరేషాన్ అవుతున్నారు.
ఆసక్తి కనబర్చని ప్రేక్షకుడు...
కావాల్సినన్ని థియేటర్‌లు ఉన్నా.. పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నా.. ప్రేక్షకుడు ఆసక్తి కనబర్చడం లేదు. కారణం ఆడియెన్స్ సినిమాపై పూర్తి అవగాహన వచ్చే వరకు థియేటర్లకు వెళ్లడం లేదు. కొందరు కంటెంట్ చూస్తే... మరికొందరు స్టార్ వాల్యూస్ చూసి.. సినిమాకు వెళ్తున్నారు. సినిమా బాగుందని టాక్ వస్తే... ఆ సినిమా బ్రతికి బయటపడ్డట్టే... లేకపోతే అంతే సంగతులు. థియేటర్ల నుంచి సినిమా తీసివేయడమే. మూవీ మేకర్స్ సగటు ప్రేక్షకుడిని దృష్టిలో ఉంచుకొని కంటెంట్ ఉన్న సినిమాలు తీయగలిగితే.. థియేటర్స్ ఆడియెన్స్‌తో కళకళలాడుతాయంటున్నారు ఫ్యాన్స్.