చెర్రీని పాన్ ఇండియా స్టార్ చేసేందుకు చిరు వ్యూహాం సక్సెస్

RRR Movie: తనయుడు, హీరో రామ్‌ చరణ్ కెరీర్ కోసం మెగాస్టార్ చిరంజీవి పకడ్బందీగా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు.

Update: 2022-03-26 12:00 GMT

చెర్రీని పాన్ ఇండియా స్టార్ చేసేందుకు చిరు వ్యూహాం సక్సెస్

RRR Movie: తనయుడు, హీరో రామ్‌ చరణ్ కెరీర్ కోసం మెగాస్టార్ చిరంజీవి పకడ్బందీగా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే చెర్రీని పాన్ ఇండియా స్టార్‌గా చేసేందుకు చిరంజీవి వ్యూహం గ్రాండ్ సక్సెస్ అయిందంటున్నారు. మొత్తానికి సిల్వర్ స్క్రీన్స్ పై ట్రిపుల్ ఆర్ మూవీ సందడి చేస్తోంది. అంతేకాదు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకు సినీ ప్రేక్షకులు సలాం అంటున్నారు. అదేవిధంగా అద్భుతమైన డైరెక్షన్ తో కొత్త అనుభూతిని పంచారని రాజమౌళిపై ప్రసంశలు కురిపిస్తున్నారు.

మరో ప్రముఖ దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శంకర్ సినిమాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ప్రధానంగా రంగస్థలం సినిమా ద్వారా తనలోని నటుడిని బయటకు తీసిన రామ్ చరణ్ మొత్తానికి ట్రిపుల్ ఆర్ తో స్వైర విహారం చేశాడు. సీన్ కటేచేస్తే నెక్ట్స్ ఆచార్యతో తండ్రికొడుకుల నట విశ్వరూపం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీంతో ఆతర్వాత చెర్రీ-శంకర్ సినిమాపై మరింత హైప్ చేరింది.

Tags:    

Similar News