ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతున్న చిరంజీవి ట్వీట్
Chiranjeevi Tweet: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారంటూ ట్వీట్
Chiranjeevi Tweet: ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి ట్వీట్ ఆసక్తి రేపుతోంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారంటూ మెగాస్టార్ ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇటీవల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదంటున్న ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి చక్కదిద్దేందుకు కసరత్తు ప్రారంభించింది సినిమా షూటింగ్‌లు సైతం గిల్డ్ బంద్ చేసింది. అగ్ర హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే అభిప్రాయాలు ఇండస్ట్రీ నుంచి వ్యక్తమయ్యాయి. టికెట్ రేట్ల పెంపుపైనా ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఫుడ్ రేట్లే కారణమనే వాదనలను కొందరు ప్రొడ్యూసర్స్ వినిపించారు.
ఫుడ్ రేట్లు తగ్గించాలంటూ యాజమాన్యాలకు సూచనలు చేశారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ కసరత్తు జరుగుతుండగానే రెండు సినిమాలు హిట్ టాక్ సంపాదించాయి. సీతారామం, బింబిసార చిత్రాలకు హిట్‌టాక్ రావడంపై చిరంజీవి సంతోషం వెలిబుచ్చుతూ ట్వీట్ చేశారు. మెగా ట్వీట్ పై ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపింది. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కథ బాగుండాలా..? లేదంటే ధరల భారం తగ్గించాలా అనేది హాట్ టాపిక్ అవుతోంది.