Chiranjeevi: చిరు,శర్వానంద్ స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి వీడియో ఇదే
Chiranjeevi-Sharwanand: శర్వానంద్ హీరోగా కిషోర్ బి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందుతున్న తాజా చిత్రం 'శ్రీకారం'.
Chiranjeevi: శర్వానంద్ హీరోగా కిషోర్ బి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందుతున్న తాజా చిత్రం 'శ్రీకారం'. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాని మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు చిరంజీవి. ఖమ్మం జిల్లాలో ప్రజా అంకిత యాత్ర పేరుతో 12 ఏళ్ల క్రితం వచ్చాన్నారు. 'ఆచార్య' షూటింగ్ నిమిత్తం వచ్చినట్లు చెప్పారు. అప్పుడు ఇప్పుడు ఖమ్మం ప్రజలు చూపిన ప్రేమను తాను ఇంకా మరిచిపోలేదని అన్నారు.
'శ్రీకారం'సినిమా హీరో శర్వానంద్ గురించి మాట్లాడిన చిరు..పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శర్వనంద్ కోసం వచ్చినట్లు చెప్పారు. శర్వానంద్ చిన్నతనం నుంచీ మా ఇంట్లోనే రామ్ చరణ్‌తో కలిసి పెరిగాడని చిరంజీవి అన్నారు. శర్వానంద్ తాను ఓ యాడ్ లో కలిసి నటించినట్లు గుర్తుచేశారు. శర్వా స్క్రీన్‌పై కనిపించడం అదే తొలిసారిన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు నాతో ఓ కుర్రాడు నటించాల్సి వచ్చింది. ఎవరైతే బాగుంటుందా? అని అనుకునే సమయంలో శర్వానంద్ ఇంట్లో ఉన్నాడు. నటిస్తావా? అని శర్వాను అడిగితే.. అంకుల్ మీరు చెబితే చేస్తాను అన్నాడు. అలా మేం ఇద్దరం వెళ్లి యాడ్‌లో నటించాం. శర్వా స్క్రీన్‌పై కనిపించడం అదే తొలిసారి'' అని చిరంజీవి చెప్పారు. చిరంజీవి, శర్వానంద్ కలిసిన నటించిన థమ్సప్ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శర్వా నటన అద్భుతంగా ఉందని చెప్పారు. శంకర్ దాదా సినిమాలో శర్వానంద్ నటనకు శ్రీకారం పడిందని, శర్వా తిలకం దిద్దింది కూడా తానేనని చిరంజీవి గర్వంగా చెప్పారు. శ్రీకారం వంటి మంచి సినిమాతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. నిర్మాతలకు, చిత్రబృందానికి అభినందలను తెలియజేశారు.
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటింస్తుంది. అధునిక వ్యవసాయం, దాని వల్లే కలిగే లాభాలు వంటి అంశాలతో కమర్షియల్ మూవీ 'శ్రీకారం'.మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ చిత్రం విడుదకానుంది. ఈ వేడుకలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, రైటర్ సాయి మాధవ్ బుర్రా, తదితరులు పాల్గొన్నారు.