Aacharya Movie : 'ఆచార్య' సినిమాలో భారీ టెంపుల్ టౌన్ సెట్ ఇదే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. ఈ మూవీ చిరంజీవి కెరీర్ 152 సినిమా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ జరుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో భారీ టెంపుల్ టౌన్ సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ ఇండియాలోనే అతి పెద్దదైన టెంపుల్ సెట్ దాదాపు 20 ఎకరాల్లో వేశారు. అయితే ఈ సెట్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ అభిమానుల కోసం 'ఆచార్య' సినిమా కోసం వేసిన సెట్ వీడియోను ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా చిరు.. ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ సెట్ ఇదని పేర్కొన్నారు. ఆ సెట్ కోసం పడ్డ కష్టం చూసి ఆశ్చర్యపోయాన్నారు. అంత పెద్ద టెంపుల్ సెట్‌ను విజువలైజ్ చేసిన డైరెక్టర్ కొరటాల శివకు, అలాగే అంత పెద్ద గుడి సెట్‌ను వేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేశ్‌కు, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్‌లకు చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని ప్రశ్నించేలా ఈ మూవీ ఉంటుంది. ఇందులో రామ్‌చరణ్ పవర్‌పుల్ పాత్రలో కనిపిస్తే, చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు. ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథాంశం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన దేవాలయాల భూముల అన్యాక్రాంతంను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని డైరెక్టర్ కొరటాల శివ ఈ కథను సిద్ధం చేశారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రియల్ హీరో సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.