తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు చిరంజీవి కీలక నిర్ణయం
Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు * జిల్లాకొక ఒక ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం
Chiranjeevi: కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తు్న్న సమయంలో చిరంజీవి తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాట్టు రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఇది వచ్చే వారం రోజుల్లోనే ప్రజలు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తు్న్నామని ట్వీట్ లో పేర్కొన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల అభిమాన సంఘాల నాయకులకు బాధ్యతలు అప్పగించిననున్నారు. సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు ప్రారంభించారన్నారని ట్వీట్ చేశారు.