Chiranjeevi: చిరుకు మరో అరుదైన గౌరవం.. 'ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పేరుతో..
Chiranjeevi Konidela: చిరంజీవి.. సగుటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
Chiranjeevi Konidela: చిరంజీవి.. సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు చిరు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ దేశం గర్వించే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం టాలీవుడ్‌కి మాత్రమే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఒక్కరిగా వచ్చి మెగా ఫ్యామిలీ ద్వారా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు చిరు.
ఇక తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన చిరంజీవికి ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. ఇటీవల భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఇలా దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న చిరుకు తాజాగా మరో అరుదైన గౌరవం లభిస్తోంది. ఐఫా అవార్డ్స్ 2024కిగాను 'ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' గౌరవాన్ని చిరు అందుకోనున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చిరు స్థానం ఎలాంటిదో చెప్పేందుకు ఇదే నిదర్శనమని మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
కాగా.. చిరంజీవి సినిమాల విషయానికొస్తే గతేడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే తాజాగా బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని నిశ్చయంతో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కతుతోన్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.