బిగ్‌బాస్ సీజన్-7లో అవకాశం కల్పిస్తానని చీటింగ్.. పోలీసులను ఆశ్రయించిన యువతి
6 నెలల క్రితం రూ.2.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఖమ్మం జిల్లా యువతి ఫిర్యాదు
Bigg Boss season-7: బిగ్‌బాస్ సీజన్-7లో అవకాశం పేరుతో మోసం వెలుగు చూసింది. బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసాడని యువతీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో ప్రొడక్షన్ ఇన్చార్జినని సత్య పరిచయం చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం బిగ్ బాస్ ఇంచార్జ్ అంటూ తమిళ రాజును సత్య పరిచయం చేశాడు. యువతి వద్ద 2లక్షల 50వేలు తీసుకొని బిగ్ బాస్ లో అవకాశం ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.