సినీ రచయిత అయిన యర్రంశెట్టి రమణ గౌతమ్ పై బంజారాహిల్స్ లో ఆయన భార్య కేసు పెట్టింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఎన్బీటీ నగర్‌లో నివసించే యర్రంశెట్టి రమణ గౌతమ్ అదే ప్రాంతానికి చెందిన యువతి (24)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపడంతో గతేడాది జూన్‌లో భర్త తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో తిరిగి కలిసి ఉండేందుకు అంగీకరించారు. కొన్నాళ్ల నుంచి రమణగౌతమ్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు ఫోన్లు చేసి కేసు వాపసు తీసుకోవాలని , లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి సినీపరిశ్రమలోనే ఉందని, ఆమె స్నేహితుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.