తమిళనాడు సర్కార్‌కు షాక్ ఇచ్చిన కేంద్రం

Update: 2021-01-06 14:53 GMT

సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో సీట్ల సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు కేంద్రం అంగీకరించలేదు. తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనా పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని 50శాతం సీట్ల సామర్థ్యంతో మాత్రమే... థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఐతే సంక్రాంతి పండగ సందర్భంగా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వినతుల మేరకు వంద శాతం సామర్థ్యం పెంచేందుకు అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇది విపత్తు నిర్వహణ ఆదేశాలను ఉల్లంఘించేలా ఉందని హోంశాఖ తెలిపింది. 

Tags:    

Similar News