సుశాంత్ కేసులో మరో మలుపు!
Sushant Singh Rajput Death Case : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ కేసును పరిశీలిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఐపీసీలో సెక్షన్ 302ని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Sushant Singh Rajput Death Case : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ కేసును పరిశీలిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఐపీసీలో సెక్షన్ 302ని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (సెక్షన్ 302 హత్య ఆరోపణకు నిలుస్తుంది). తాజాగా సుశాంత్ కేసుకి సంబంధించి ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ సుశాంత్ పైన ఎలాంటి విషప్రయోగం జరగలేదని తన నివేదికలో వెల్లడించింది. అయితే సుశాంత్ ది ఆత్మహత్యా, హత్యా అన్నది తాము నిర్ధారించలేమని పేర్కొంది.
అలాగే సుశాంత్ ని విషయం ప్రయోగంతో కాకుండా మరో రకంగా హత్య చేసి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేమని పేర్కొంది. అయితే ఈ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సెక్షన్ 302ని చేర్చాలని యోచిస్తున్నట్టుగా సీబీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి. దీనితో ఈ కేసు ఇపుడు మరో సరికొత్త మలుపు తిరిగినట్టు అయ్యింది. అటు ఈ కేసుకి సంబంధించి సీబీఐ రెండవ రౌండ్ దర్యాప్తును ప్రారంభించింది.. ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న దీపేష్ సావంత్ , సిద్ధార్థ్ పితాని మొదలగువారిని సీబీఐ మరోసారి విచారించనుంది.
అయితే సీబీఐ పైన తమకు పూర్తి నమ్మకం ఉందని, నిజాలు తెలుసుకోవడానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని, దేవుడు ఖచ్చితంగా న్యాయం వైపే నిలుస్తాడని సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి పోస్ట్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే సుశాంత్ మృతి చెందడానికి ముందు రోజు రాత్రి జూన్ 13న సుశాంత్, నటి రియా చక్రవర్తిని కలిసినట్టుగా ముంబైకి చెందిన బీజేపీ స్థానిక నాయకుడు వివేకానంద గుప్తా అంటున్నారు..ఈ విషయాన్నీ సీబీఐ ముందు చెప్పడానికి కూడా తానూ సిద్దమేనని అయన అన్నారు.