'ఆదిపురుష్'పై పిటిషన్ దాఖలు!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది సినిమాపై జౌన్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యాలు మత విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అయన పిటిషన్ దాఖలు చేశారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో ఓంరౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లోకి చిక్కుకుంది. ఈ సినిమాలో రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ ఇటీవల మాట్లాడుతూ.. ''రాముడితో రావణుడు యుద్ధం చేయడం సబబే. రావణుడిలో ఉన్న మానవత్వ కోణాన్ని 'ఆదిపురుష్'లో చూపించబోతున్నాం'' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ కామెంట్స్ పెద్ద చర్చకు దారీ తీయడంతో సైఫ్ అలీఖాన్ చివరికి క్షమాపణలు చెప్పాడు. అయితే ఇంతటితో ఈ వివాదం ముగిసిపోలేదు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది సినిమాపై జౌన్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యాలు మత విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అయన పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో దర్శకుడు ఓంరౌత్ పేరు కూడా చేర్చారు. ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వచ్చేసరికి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఈ సినిమాని 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది.