Captain Vijayakant: కెప్టెన్ విజయ్ కాంత్ కు అస్వస్థత

Captain Vijayakant: కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు.

Update: 2021-05-19 05:01 GMT

Captain Vijayakanth:(File Image) 

Captain Vijayakant: కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయననను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.

గత ఏడాది ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని అప్పట్లో ఆయన తెలిపారు. ఆ తర్వాత చికిత్స తీసుకుని ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం డాక్ట‌ర్లు ఆయనకు అత్య‌వ‌స‌ర‌ చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం విజయకాంత్ ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉన్న‌ట్లు వార్తలు వెలువడున్నాడు. అయితే డీఎండీకే విడుద‌ల చేసిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లో మాత్రం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు చెబుతున్నారు. విజయ్కాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News