Vijayakanth: డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూత

Vijayakanth: చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Update: 2023-12-28 03:48 GMT

Vijayakanth: డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ కన్నుమూత

Vijayakanth: డీఎండీకే అధినేత, కెప్టెన్ విజయ్‌కాంత్‌ మృతి చెందారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారింగా వెల్లడించింది. అయితే విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు ఏర్పడుతుండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా విజయకాంత్‌ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌కు కరోనా సోకింది. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు.

Tags:    

Similar News