దెబ్బకు దిగొచ్చిన బుక్ మై షో.. ఆన్ లైన్‌లో బీమ్లా నాయక్ బుకింగ్ షురూ..

Bheemla Nayak: నైజాం ఏరియాలో థియేటర్ యజమానుల పంతం నెగ్గింది. బుక్ మై షో దిగి వచ్చింది.

Update: 2022-02-23 09:20 GMT

దెబ్బకు దిగొచ్చిన బుక్ మై షో.. ఆన్ లైన్‌లో బీమ్లా నాయక్ బుకింగ్ షురూ..

Bheemla Nayak: నైజాం ఏరియాలో థియేటర్ యజమానుల పంతం నెగ్గింది. బుక్ మై షో దిగి వచ్చింది. ప్రేక్షకుడి దగ్గర నుంచి టికెట్ రేట్ మీద అదనంగా వసూలు చేసే మొత్తం నుంచి థియేటర్ యజమానులకు నేరుగా ఇచ్చే మొత్తాన్ని పెంచే విషయంలో వివాదం నెలకొంది. ఇప్పుడు థియేటర్స్, బుక్ మై షో మధ్య ఒక ఒప్పందం కుదరడంతో వివాదం సమిసిపోయింది. దీంతో గత రెండురోజులుగా ఆన్ లైన్‌లో టికెట్ బుకింగ్స్ మొదలైయ్యాయి.

నిన్నమొన్నటి వరకు టికెట్ రేటు మీద ఎనిమిది శాతాన్ని బుక్ మై షో థియేటర్ యజమాన్యానికి ఇస్తూ వస్తుంది. వంద రూపాయల టికెట్‌కు ఎనిమిది రూపాయలు వెనక్కి ఇవ్వడంతో ఇది థియేటర్లకు అదనపు ఆదాయం అనే చెప్పాలి. అయితే ఇటీవల టికెట్ రేట్లు 250కి పెరడంతో ఇరవై రూపాయలు ఇవ్వాలన్నది థియేటర్ల వాదన. కానీ బుక్ మై షో అలా చేయకపోవడంతో ఆన్ లైన్‌కు టికెట్‌లు ఇవ్వడం ఆపేసారు. దీంతో ఇరువైపులా చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు.

ఇప్పుడు 250 రూపాయల టికెట్ లేదా సింగిల్ స్క్రీన్‌లకు 16 రూపాయలు ఇవ్వడానికి బుక్ మై షో ఓకే చేసింది. సింగిల్ స్క్రీన్‌లో బుక్ మై షో ద్వారా టికెట్ అమ్మితే 266 రూపాయలు వస్తుందన్న మాట. అలాగే మల్టీ ఫ్లెక్స్‌ల్లో విక్రయిస్తే థియేటర్స్‌కు 21 రూపాయలు అదనంగా వస్తుంది.

మొత్తానికి బుక్ మై షో దిగి రావడంతో థియేటర్ల పంతం నెగ్గినట్లు అయ్యింది. దీంతో బుక్ మై షో గతంలో ఇచ్చినట్లు ఎనిమిది శాతం కాకపోయినా ఆరు నుంచి ఏడు శాతం వెనక్కు ఇచ్చినట్లు అయింది.

Tags:    

Similar News