అనురాగ్ కశ్యప్ కు మద్దతుగా సాయాని గుప్తా...
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పైన నటి పాయల్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పైన నటి పాయల్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనురాగ్ కశ్యప్ పైన కీలక వాఖ్యలు చేశారు. తనతో ఎదో మాట్లాడలని చెప్పి ఇంటికి రమ్మని చెప్పి అనురాగ్ కశ్యప్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని పాయల్ ఘోష్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అయితే ఆ వాఖ్యాలపైన దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవన్నారు. ఈ మేరకు అయన ట్విటర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు.
ఆమె చేసిన ఆరోపణల వలన చాలా మంది నుంచి ఫోన్స్, మెస్సేజ్‌లు వచ్చినట్టుగా అనురాగ్ కశ్యప్ వెల్లడించాడు. అయితే ఆమె చేసిన ఆరోపణలకి ఎవరు స్పందిన్చావద్దునని చెప్పినప్పటికీ నటి పాయల్ ఘోష్ కి సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా వెల్లడించాడు. ఒక మహిళ అయిన మీరు.. నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలున్నాయంటూ ఆరోపించడం తప్పుగా అనిపించలేదా? అంటూ అనురాగ్ కశ్యప్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడు అనురాగ్ కశ్యప్ కి మద్దతుగా మరో బాలీవుడ్ నటి సయాని గుప్తా # మీ టూ ఆరోపణలకు వ్యతిరేకంగా ట్వీట్ చేసారు. ఆమెతో పాటు నటి తప్సీ కుడా స్పందించి తన ఇంష్టాగ్రాం లో పోస్ట్ చేసారు. అంతే కాదు వీటిపై పలువు ప్రముఖులు కుడా స్పందిస్తూ.. ట్వీట్లు చేసారు.
తాప్సీ అనురాగ్‌ను అతిపెద్ద ఫెమినిస్ట్‌గా ట్యాగ్ చేసి, పెద్ద తెరపై మరింత శక్తివంతమైన, ముఖ్యమైన మహిళా పాత్రలను సృష్టించడానికి అనురాగ్ తిరిగి సెట్‌లకు వస్తారని ఆశించారు. ఆమె అనురాగ్‌తో ఒక త్రోబాక్ పిక్చర్‌ను కూడా పోస్ట్ చేసారు. #MeToo సంచికలో అతనికి మద్దతు ఇచ్చింది. సుర్వీన్ చావ్లా మరియు టిస్కా చోప్రా కూడా అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా వచ్చి తమ సందేశాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.