ఇంకా ఎంత మంది నిర్భయలు బలి కావాలి : ప్రియాంక చోప్రా
Priyanka Chopra Reacts on Hathras : ఉత్తరప్రదేశ్ లోని హత్రస్ లో ఓ 19 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి..
Priyanka Chopra Reacts on Hathras : ఉత్తరప్రదేశ్ లోని హత్రస్ లో ఓ 19 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.. నిందితులను బహిరంగంగా చంపేయాలి అన్న డిమాండ్ మొదలైంది. సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటన జరగగా బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించింది. ఇదే దారుణం అనుకుంటే గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రి యూపీ పోలీసులు బాధితురాలి అంత్యక్రియలు నిర్వహించారు. దీనితో యూపీ ప్రభుత్వం పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘటనకి కారణం అయిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ ఘటన పైన స్పందించారు. నేటి ఘటన నాటి నిర్భయ సామూహిక హత్యచారాన్ని గుర్తుచేస్తుందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనని వ్యక్తం చేసింది ప్రియాంక..
'అగౌరవం, దుర్భాష.. నిరాశ, కోపం... మళ్లీ, మళ్లీ, మళ్లీ.. మహిళలు, యువతులు, చిన్నాలపైనే ఎప్పుడూ అఘాత్యాలపై అఘ్యాతాలు... కానీ వారి ఎడుపులు, అరుపులు మాత్రం ఎవరికి వినపడటం లేదు. ఇంకా ఎంత మంది నిర్భయలు బలి కావాలి' అంటూ ప్రియాంక భావోద్యేగానికి లోనైంది..
ఇక ఈ గత నెల 14 న పశువుల మేత కోసం అడవికి వెళ్ళిన 19 ఏళ్ల యువతి పైన మానవ మృగాలు పైశాచికత్వం చూపించాయి. యువతిని నిర్భందించి సాముహిక అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందో ఏమో అని భయంతో యువతి నాలుకను కోసేశారు. దీనితో తీవ్ర రక్తస్త్రావానికి గురైనా భాదితురాలు ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలను విడిచింది. ఈ కేసులో నలుగురి పైన 302 కింద కేసు నమోదు చేశారు.