Bollywood: 200 కోట్ల మనీలాండరింగ్ కేసు... ఈడీ విచారణకు బాలీవుడ్ నటి
Bollywood: కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర కీలకమంటున్న ఈడీ
Bollywood: ముంబై డ్రగ్స్ కేసు ఎపిసోడ్ కంటిన్యూ అవుతున్న వేళ బీ టౌన్లో మరో రచ్చ రాజుకుంది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణకు ఇప్పటికే బాలీవుడ్ నటి నోరా ఫతే ఈడీ ముందు హాజరు కాగా రేపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సైతం అధికారుల ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఈడీ ఒకసారి విచారించింది. ఈ మొత్తం కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర కీలకమని ఈడీ ఆరోపిస్తోంది.