Kangana Ranaut : క్యాస్టింగ్‌ కౌచ్‌పై కంగనా సంచలన వ్యాఖ్యలు!

Kangana Ranaut : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ పెద్దల పైన కీలక వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో

Update: 2020-09-20 11:35 GMT

Kangana Ranaut

Kangana Ranaut : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ పెద్దల పైన కీలక వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ .. తాజాగా మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది.. ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంగనా బాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ మరియు మహిళలపై ఒత్తిడి గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ అయినప్పటికీ.. ఏదైనా సినిమాలో అవకాశం పొందాలంటే ఆ సినిమాకు పనిచేసే వారిలో కొందరిని సంతోషపెట్టాల్సిందేనంటూ అంటూ వాఖ్యలు చేసింది.

అంతేకాకుండా.. ఈ మాటలు ప్రత్యేకంగా ఎవరినో ఉద్దేశించి చెప్పడం లేదని, ఇండస్ట్రీలో సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టుగా వెల్లడించింది.. ఏ లిస్ట్‌, బీ లిస్ట్‌, లేదా అతిపెద్ద సూపర్‌స్టార్స్‌ ఎవరైనా సరే తమతో సెట్స్ లో ఉన్న సమయంలో నటీమణులు తమ భార్యల లాగా ప్రవర్తించాలని ఆశిస్తారని కంగనా పేర్కొంది. సినిమాలు, హీరోలు మారినప్పటికీ పరిస్థితి ఇదేనంటూ చెప్పుకొచ్చింది. బహుశా తనకి తెలిసి ఇండస్ట్రీలో జయాబచ్చన్‌ చాలా సురక్షితమైన నటీమణిగా ఉండుంటారు. ఎందుకంటే ఆమె పక్కన ఓ ఒక శక్తివంతమైన వ్యక్తి ఉన్నారు.. నటిగా ఆమెకున్న అనుభవాన్ని నేను తప్పుబట్టడం లేదు. అలా అని ప్రవీణ్‌ బాబీ, జీనత్‌ అమన్‌లకు జరిగిన అన్యాయాన్ని మనం తిరస్కరించకుండా ఉండలేము కదా.' అని కంగనా వాఖ్యనించింది. '

ఇటివల చాలా వివాదాస్పద వాఖ్యలు చేస్తూ బాలీవుడ్ లో మోస్ట్ హాట్ టాపిక్ గా నిలిచింది కంగనా.. బాలీవుడ్ నటి ఉర్మిలా మాటోండ్కర్ ను 'సాఫ్ట్ పోర్న్ నటి' అంటూ వాఖ్యలు చేసింది.. అయితే రంగీలా నటికి మద్దతుగా చాలా మంది అభిమానులు రావడంతో ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంతలో, కంగనా తన నాలుగు రోజుల ముంబై పర్యటన తర్వాత మనాలికి తిరిగి వచ్చింది. బీఎంసీ అధికారులు తన కార్యాలయాన్నిఅక్రమంగా ఉందంటూ కొంత భాగాన్ని కూల్చివేశారు. దీనికి వ్యతిరేకంగా ఆమె బొంబాయి హైకోర్టులో పిటిషన్ లను దాఖలు చేసింది.. బిఎంసి అధికారులు తనకి రూ .2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అటు బీఎంసీ కూడా కోర్టులో స్పందించి, పిటిషన్‌ను ఖర్చులతో కొట్టివేయాలని కోరింది.

Tags:    

Similar News