Abhishek Bachchan: అభిషేక్ వల్లే బచ్చన్ ఫ్యామిలీకి కరోనా?
Abhishek Bachchan: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్నా, పెద్ద , ధనిక, పేద అనే భేదం లేకుండా ఎవరిని వదలడం లేదు..
Abhishek Bachchan: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్నా, పెద్ద , ధనిక, పేద అనే భేదం లేకుండా ఎవరిని వదలడం లేదు.. ఇక బాలీవుడ్ నటులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. అయనతో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ , కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆధ్య (అభిషేక్, ఐశ్వర్య దంపతుల కూతురు) కూడా కరోనా సోకింది. మిగిలిన కుటుంబ సభ్యులు.. జయ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా , ఆమె పిల్లలు అగస్త్య , నవ్య నవేలి నివేదికలు మాత్రం నెగటివ్ అని వచ్చాయి. బిగ్ బీ కుటుంబంలో నలుగురికి కరోనా రావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే కరోనా వైరస్ పైన జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించిన బచ్చన్ ఫ్యామిలీకి కరోనా ఎలా సోకింది అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ ల కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇందులో వృద్ధ నటులకు షూటింగ్ చేయడానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో బిగ్ బీ ఇంట్లో ఉండి కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ కానిస్తున్నారు..
ఇక అభిషేక్ బచ్చన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ 'బ్రీత్: ఇన్ టు ది షాడో' లో నటిస్తున్నాడు. దానికోసం అభిషేక్ కొన్ని రోజుల క్రితం డబ్బింగ్ చెప్పడం కోసం డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాడు. ఈ క్రమంలో అయనకి అక్కడ కరోనా సోకిందని అక్కడి నుంచి మొత్తం ఫ్యామిలీకి కరోనా ఎటాక్ అయిందని తెలుస్తోంది. అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ముంబైలోని నానావతి దవాఖానలో చేర్చగా, ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోను ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
బిగ్ బీ ఆరోగ్యం నిలకడ:
కరోనా నిర్ధారణ కావడంతో బిగ్ బీ ముంబైలోని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యం అందిస్తున్న వైద్యులు ఆయనలో తేలికపాటి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా వెల్లడించారు. ఇక అంతకుముందు బిగ్ బీ తనతో గత పదిరోజులుగా దగ్గరగా గడిపిన అందరినీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.