కంగనాకి షాక్ : ఆమె పిటిషన్ ను కొట్టివేయాలంటూ హైకోర్టుకి బీఎంసీ
BMC Request To HC : కంగనా రనౌత్.. బాలీవుడ్ లో కాకుండా మహారాష్ట్రలో మోస్ట్ హాట్ టాపిక్.. ఎక్కడ చూసిన ఇప్పుడే ఈమె పేరు వినిపిస్తుంది.
BMC Request To HC : కంగనా రనౌత్.. బాలీవుడ్ లో కాకుండా మహారాష్ట్రలో మోస్ట్ హాట్ టాపిక్.. ఎక్కడ చూసిన ఇప్పుడే ఈమె పేరు వినిపిస్తుంది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం పైన, మరియి ముంబై పోలిసుల పైన కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఈ ఫైర్ బ్రాండ్. ముఖ్యంగా ముంబైని పీవోకే(POK)తో పోల్చడం శివసేన నేతలకి నచ్చలేదు.. దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం పెరిగింది.
ఈ క్రమంలోని సెప్టెంబర్ 9 న ముంబైలోని ఆమె కార్యాలయాన్ని అక్రమంగా ఉందంటూ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు కొంత భాగాన్ని కూల్చి వేశారు. దీంతో అదే రోజున కంగనా ముంబై హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ ఎస్.జె. కథవల్లా నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతను నిలిపివేసింది. ఇక ఈ పిటిషన్ లో కంగనా తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు గాను బీఎంసీ తనకు రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని తన పిటిషన్ లో కోరింది.
అయితే కంగనా వేసిన ఈ పిటిషన్ ను కొట్టివేయాలని బీఎంసీ హైకోర్టును కోరింది. చట్టపరంగా చేసిన చర్యను తప్పుపడుతూ పిటిషన్ వేయడం తప్పని పేర్కొంది. అంతేకాకండా చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసినందుకు కంగనాకు జరిమానా విధించాలని హైకోర్టును కోరింది. దీనిపైన తదుపరి విచారణ సెప్టెంబర్ 22 న జరగనుంది.
ఇక ఇదే అంశం పైన మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కౌశ్యారిని కంగనా కలిసింది. తన సోదరి రంగోలితో కలిసి గవర్నర్‌తో భేటీ అయిన కంగనా.. తన కార్యాలయాన్ని BMC అధికారులు కూల్చివేయడంపై ఫిర్యాదు చేసింది. అలాగే తనపై ఇటీవల శివసేన నేతలు చేస్తున్న కామెంట్లు, అనంతరం జరిగిన పరిణామాలు, ప్రభుత్వ వ్యవహార శైలిని గవర్నర్ దృష్టికి కంగనా తీసుకెళ్లింది.