తెలుగు సినిమా సింధూరం "కృష్ణవంశీ"

Update: 2019-07-28 04:40 GMT

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు ఉన్నారు . కానీ ప్రేక్షకుల మదిలో నిలిచినా దర్శకులు మాత్రం కొందరే ఉన్నారు . అందులో కృష్ణవంశీ ఒకరు ..కృష్ణవంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగారు రాజు.. తెలుగు సినీ పరిశ్రమలో సృజనాత్మక కలిగిన దర్శకుడుగా మరియు ఫ్యామిలీ మూవీస్ స్పెషలిస్ట్ గా కృష్ణవంశీకి మంచి పేరుంది . దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసి గులాబీ అనే సినిమాతో దర్శకుడుగా తెలుగు తెరపైకి పరిచయం అయ్యారు . రామ్ గోపాల్ దగ్గర శిష్యరికం చేసినప్పటికీ అయనలోని భావాలూ ఒక్కటికి కూడా కృష్ణవంశీ లో కనిపించవు . తనకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు అయన .. అనగనగా ఒక రోజు అనే సినిమాని ముందుగా దర్శకత్వం వహించే అవకాశం వచ్చినప్పటికీ బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే గులాబి అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది...

గులాబీ సినిమాతో వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించిన కృష్ణవంశి తన తదుపరి చిత్రం అక్కినేని నాగార్జునతో ఛాన్స్ కొట్టేశారు . నిన్నే పెళ్ళాడుతా సినిమాని తెరకెక్కించి మరో హిట్టును సొంతం చేసుకున్నారు . ఈ సినిమాకి గాను కృష్ణవంశికి నంది అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు లభించింది . ఈ సినిమా తర్వాత ఆయనే స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి 'ఆంధ్రా టాకీస్' సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి సముద్రం లాంటి సినిమాలను తీసినట్టు స్వయంగా అతనే ఇంటర్వ్యూలలో చెప్పాడు.

అ తర్వాత మహేష్ బాబుతో తెరకెక్కించిన మురారి సినిమా కృష్ణ వంశీకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక శ్రీకాంత్ , రవితేజ , సోనాలి బింద్రేలతో కలిసి చేసిన ఖడ్గం సినిమా కృష్ణవంశిని స్టార్ డైరెక్టర్ ని చేసింది . ఇక చక్రం , చందమామ , శశిరేఖా పరిణయం లాంటి సినిమాలు అయన ప్రతిభకి అద్దం పట్టాయి . ప్రతి సినిమా సినిమాకి తనకి తానూ మార్చుకుంటూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించారు కృష్ణవంశి .. మొత్తం అయన ఇప్పటివరకు అయిదు నంది అవార్డులను అందుకున్నారు . అయన ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణని వివాహం చేసుకున్నారు . ఈరోజు అయన జన్మదినం సందర్భంగా ఆయన ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది హెచ్ఎంటివి ... 

Tags:    

Similar News