నేను గేమ్ మొదలు పెడితే మీరు తట్టుకోలేరు : గంగవ్వ

Gangavva Counter to Jordar Sujatha : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సిజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మందితో మొదలైన ఈ ఎపిసోడ్ ఎలిమినేషన్ లు, ఎమోషన్స్, ఫన్నీ టాస్క్ లతో మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Update: 2020-10-18 07:57 GMT

Gangavva Counter to Jordar Sujatha : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సిజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మందితో మొదలైన ఈ ఎపిసోడ్ ఎలిమినేషన్ లు, ఎమోషన్స్, ఫన్నీ టాస్క్ లతో మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే హౌస్ లోని సభ్యులకు గట్టి పోటి ఇస్తూ అయిదు వారాల పాటు హౌస్ లో ఉన్న గంగవ్వ అనారోగ్య సమస్యలతో అక్కడ ఉండలేక హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ అయిపొయింది. అందులో భాగంగానే తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాతతో కలిసి HMTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది గంగవ్వ.

ఈ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ.. ఇంటినుంచి బయటకి ఎప్పుడు పోలే.. ఒక్కసారిగా అన్ని రోజులు ఇల్లు విడిచి బయటకు వచ్చేసరికి అన్ని గుర్తొచ్చినయ్..ఇల్లు గుర్తొచ్చేసరికి జ్వరం వచ్చింది. అయితే ఇల్లు విడిచి ఉంటాననే నమ్మకంతోనే అక్కడికి వచ్చానని, కానీ అక్కడికి వచ్చాక అంతా తారుమారు అయిందని గంగవ్వ వెల్లడించింది. హౌస్ లో ఉండడం కష్టమైందని అంది గంగవ్వ.. అయితే బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు, ఇంటి సభ్యులు అందరూ తనని బాగా చూసుకున్నారని గంగవ్వ వెల్లడించింది. కేవలం హౌస్ లో తనకు ఆరోగ్య బాలేకనే బయటకు వచ్చానని అంతే తప్ప మరేమీ లేదని వెల్లడించింది గంగవ్వ..

ఇక బిగ్ బాస్ లో తానూ సగం ఆట మాత్రమే ఆడానని, లేకపోతే అందరిని కలిపి ఓ ఆట ఆడుకునేదాన్ని అని గంగవ్వ చెప్పుకొచ్చింది. అటు బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అంది. అటు బిగ్ బాస్ షో కి వెళ్లి విన్నర్ గా నిలవలెకపొయున చాలా మంది హృదయాలను గెలుచుకుంది గంగవ్వ! 


Full View


Tags:    

Similar News