Nagarjuna Bigg Boss 5 Remuneration: ఎట్టకేలకు తెలుగు లోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలైంది. 3 మరియు 4 సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున కూడా ఈ సీజన్ కి హోస్ట్గా విచ్చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 3 మరియు 4 వ సీజన్లకు నాగార్జున సీజన్ కు 11 నుంచి 12 కోట్ల చొప్పున తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 లో నాగార్జున తన రెమ్యునరేషన్ను 15 శాతం పెంచినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు నాగార్జున ప్రతి ఎపిసోడ్ కి 12 లక్షలు తీసుకోబోతున్నారట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడనుంది. ఎప్పటికంటే ఎక్కువగా ఈ సారి 14 మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. సిరి హనుమంత్, వి జె సన్నీ, లహరి, శ్రీ రామచంద్ర, అనే, లోగో, ప్రియాంక సింగ్, జశ్వంత్, షణ్ముఖ్ జస్వంత్, హమీద, నట్రాజ్ మాస్టర్, సరయు, విశ్వ, ఉమాదేవి, మానస్, కాజల్ మరియు శ్వేత వర్మ లు బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో ఈసారి టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.