Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7కు ముహూర్తం ఫిక్స్.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే.. గత సీజన్‌ ఎఫెక్ట్‌తో కీలక మార్పులు?

Bigg Boss Season 7: బిగ్ బాస్ తెలుగు దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన రియాలిటీ షోలలో ఒకటిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే.

Update: 2023-06-29 07:30 GMT

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7కు ముహూర్తం ఫిక్స్.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే.. గత సీజన్‌ ఎఫెక్ట్‌తో కీలక మార్పులు?

Bigg Boss Season 7: బిగ్ బాస్ తెలుగు దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన రియాలిటీ షోలలో ఒకటిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. గత 6 సీజన్‌లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌కు రంగం సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షోకు సంబంధించి అనేక మార్పులు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, బిగ్ బాస్ తెలుగు 6వ ఎడిషన్ జనాల దృష్టిని ఆకర్షించలేక పోయిన సంగతి తెలిసిందే. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. కాస్త వరస్ట్ రియాలిటీ షోగా పేరుగాంచింది. సీజన్ 6 ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో సీజన్ 7పై ఫోకస్ భారీగా పెంచారంట. సీజన్ 7ని సక్సెస్ ఫుల్‌గా రన్ చేసేందుకు నిర్వాహకులు భారీగా ప్లాన్ చేశారంట. అందుకే సీజన్ 7 ఆలస్యం అయిందని తెలుస్తోంది.

సాధారణంగా బిగ్ బాస్ సీజన్‌ను సెప్టెంబర్ నెలలో మొదలుపెడతారు. అయితే, ఒక్క సీజన్ 6 మినహాయించితే మిగిలిన సీజన్లు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇదే క్రమంలో సీజన్‌ 7ను సెప్టెంబర్‌లో షురూ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారంట. సీజన్ 7 విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా.. కంటెస్టెంట్స్‌గా యూట్యూబర్లను పక్కన పెట్టి, అల్లాటప్పా యాంకర్లను కూడా తీసుకోరంట. సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్లనే తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారంట.

సీజన్ 7తో టీఆర్పీల దుమ్ము దులపాలని, పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని నిర్వాహకులు కోరుకుంటున్నారంట. ఇక తాజాగా సమాచారం మేరకు సెప్టెంబర్ నెలలో సీజన్ 7(Telugu Bigg Boss Season 7) ప్రారంభానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారంట. ఈమేరకు సెప్టెంబర్ 2 అంటే ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 7 మొదలుకానుందంట. లేదంటే సెప్టెంబర్ 9 ఆదివారం నుంచి మొదలుపెట్టనున్నారంట. మాములుగా అయితే, బిగ్ బాస్ విన్నర్లకు బయట భారీగా ఫాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే,సీజన్‌ 6లో మాత్రం విజేత ఎవరు, హౌస్‌లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సీజన్ 6 విన్నర్‌గా రేవంత్ ఎన్నికయ్యాడు. ఏదో తూతుమంత్రంగా సీజన్‌ 6ను కానిచ్చేశారు.

బిగ్ బాస్ 7 తెలుగులో పోటీ చేయనున్న జాబితా(అంచనా)

అయితే, ఈసారి హోస్ట్‌గా నాగర్జున అక్కినేని చేస్తారా? లేదా వేరే వారిని తీసుకొస్తారా అనేది చూడాలి. "అన్‌స్టాపబుల్" షో హోస్ట్ నందమూరి బాలకృష్ణను ఈ సారి సీజన్‌7కు హోస్ట్‌గా తీసుకరావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారంట. అలాగే రానా దగ్గుబాటిని కూడా తీసుకొస్తారనే టాక్ నడుస్తోంది. అయితే, వీటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. బిగ్ బాస్ 7 తెలుగు పార్టిసిపెంట్లను బిగ్ బాస్ టీమ్ ఇంకా ఎంపిక చేయలేదు. అయితే సోషల్ మీడియాలో కొందరి పేర్లు షికారు చేస్తున్నాయి. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈటీవీ ప్రభాకర్ (నటుడు)

నిఖిలు (యూట్యూబర్)

సాయి రోనక్ (నటుడు)

విష్ణు ప్రియ (నటి)

ఢీ పాండు (కొరియోగ్రాఫర్)

అమర్‌దీప్ చౌదరి (నటుడు)

మహేష్ బాబు కాళిదాసు (నటుడు)

సిద్ధార్థ్ వర్మ (నటుడు)

సాకేత్ కొమండూరి (గాయకుడు)

జబర్దస్త్ అప్పారావు (హాస్యనటుడు)

మోహన భోగరాజు (గాయని)

శోభా శెట్టి (నటి)

ఈ లిస్టుపై బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏది ఏమైనా సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఈ షో మొదలుకానుందంట. అప్పుడే అసలైన పార్టిసిపెంట్లు ఎవరనేది బయటకు వస్తుంది.

Tags:    

Similar News