Bigg Boss Faima: ఫైమాకు ప్రపోజ్ చేశాను.. కానీ, నన్ను రిజక్ట్ చేసింది: ప్రవీణ్
Bigg Boss Faima: ఫైమాకు ప్రపోజ్ చేశాను.. కానీ, నన్ను రిజక్ట్ చేసింది: ప్రవీణ్
Praveen - Faima: బుల్లితెరపై ఎందరో నటీనటులు కనిపిస్తుంటారు. అయితే, వారిలో కొందరు జనాలకు బాగా నచ్చుతుంటారు. దీంతో వారికి పాపులరీతోపాటు అవకాశాలు బాగా వస్తుంటాయి. అలా ఫేమస్ అయిన వాళ్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగ జబర్దస్ షో నుంచి చాలామంది ఇలానే ఫేమస్ అయ్యారు. ఇలాంటి వారిలో ప్రవీణ్, ఫైమాలు కూడా ఉన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ప్రవీణ్ తొలిసారి మీడియా ముందు ఓపెన్ అయ్యాడు. తన లవ్ గురించి కీలక విషయాలు షేర్ చేశాడు. బిగ్ బాస్ ఫైమాతో ప్రేమలో ఉన్నాడంటూ.. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఆమధ్య పలు స్టేజీల్లో ఇదే మాట చెప్పిన ప్రవీణ్.. కొంత క్లారిటీ ఇచ్చాడు. అయితే, దీనికి ఫైమా కూడా వ్యతిరేకత చెప్పలేదు. దీంతో వీరి ప్రేమ నిజమేనంటూ చెప్పుకొచ్చారు.
ఈ మేరకు ప్రవీణ్ ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ..'నా బుల్లితెర ప్రయాణం ఆమెతోనే మొదలైంది. తొలి నుంచి నాతోనే ఉంది. ఇద్దరి మధ్య స్నేహం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఓరోజు ప్రేమిస్తున్నాని తెలిపాను. ఫైమా నాకు నో చెప్పింది. నాకు అనిపించింది అంతా చెప్పేశాను. అయితే, ఆమె నిర్ణయాన్ని కూడా కాదనలేం. నేనంటే ఆమెకు ఇష్టం ఉండొచ్చు.. లేకపోవచ్చు. ఆమె డెషిషన్‌ను తప్పపట్టలేం. నాకు నో చెప్పినా.. ఆమెకు దూరంగా నేను లేను. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా లేకున్నా స్నేహితులుగా ఉందామని నిర్ణయించుకున్నాం. అయితే, నా ప్రేమను ఒప్పుకోనందుకు చాలా బాధగా అనిపించింది. ఆ విషయం గుర్తు చేసుకుని బాగా ఏడ్చాను' అంటూ చెప్పుకొచ్చాడు.
'అలాగే ఫైమా నా ప్రేమను భవిష్యత్తులో ఓకే చెబితే.. సంతోషిస్తానని, నేను తప్పకుండా అంగీకరిస్తాను' అంటూ తన ప్రేమ గురించి తెలిపాడు.
బిగ్ బాస్‌లో మారిన ఫైమా..?
బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగులో ఫైమా కూడా ఓ కంటెస్టెంట్‌గా చేరింది. అయితే, ఈ షో ఆమెకు సెలబ్రిటీ గుర్తింపు ఇఛ్చింది. దీంతోనే ప్రవీణ్‌ను పక్కన పెట్టిందంటూ వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ప్రవీణ్ మాట్లాడుతూ.. 'బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఫైమా బాగా డీలా పడింది. కొద్ది రోజులు ఫైమా ఎవర్నీ కలవలేదు. తర్వాత మాములుగానే ఉంది' అని తెలిపాడు.
ఫైమా ప్రవీణ్‌ను మోసం చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ, ప్రవీణ్ మాత్రం ఈ విషయాలేవీ చెప్పకుండా.. తను మాత్రమే ఫైమాను ప్రేమించానంటూ..ఆమె నన్ను ఓ ఫ్రెండ్‌గా చూసిందని, ప్రేమించలేదని తెలిపాడు. దీంతో ఆమెను సేఫ్ సైడ్‌లో ఉంచేశాడు. అయితే, బిగ్‌బాస్‌లో ఉన్న సమయంలో ప్రవీణ్ అంటే తనకు ఇష్టమంటూ హోస్ట్ నాగార్జునతో ఫైమా చెప్పిన విషయాన్ని నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ మొత్తం గేమ్‌లో పాపం ప్రవీణ్ వన్‌సైడ్ లవర్ బాయ్ ఆర్యలా మిగిలాడంటూ వారు కామెంట్లు చేస్తున్నారు.